News January 9, 2025
భీమదేవరపల్లి: రేపటి నుంచి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు

కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 10న స్వామి వారి కళ్యాణం, 11న త్రిశూలార్చన, 12న లక్షబిల్వర్చన, 13న భోగి పండుగ, 14న సంక్రాంతి పండుగ సందర్భంగా బండ్లు తిరుగుట,15న కనుమ ఉత్సవం,16న పుష్పయాగం, నాగవళ్లి, 17న త్రిశూల స్నానం కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ఈఓ కిషన్ రావు తెలిపారు.
Similar News
News November 30, 2025
కరీంనగర్: 113 గ్రామాలకు 121 నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి రోజు 113 గ్రామాలకు121 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. చిగురు మామిడి మండలంలో 16, గన్నేరువరం మండలంలో 10, మానకొండూర్ మండలంలో 30, శంకరపట్నం మండలంలో 35, తిమ్మాపూర్ మండలంలో 30 గ్రామ సర్పంచికి నామినేషన్లు దాఖలు అయ్యాయి.113 గ్రామాలలో 1046 వార్డు లు ఉండగా, మొదటి రోజు 209 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు.
News November 30, 2025
కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కరీంనగర్ రూరల్ మండలం నగునూరు శివారు చమనపల్లి రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొదట రెండు బైక్లు ఢీకొనగా అటుగా వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు చామనపల్లి, సాంబయ్యపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News November 30, 2025
KNR: ‘ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్కు అప్లై చేసుకోండి’

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్టీ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన అభివృద్ధి అధికారిణి కే.సంగీత తెలిపారు. 5 నుంచి 10వ తరగతి విద్యార్థులు డిసెంబర్ 31లోగా e-passలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సంబంధిత హెచ్ఎంలు రిజిస్ట్రేషన్ పత్రాలను అప్లోడ్ చేయాలని ఆమె సూచించారు.


