News March 13, 2025
భీమవరంలో కాలేజీకి బాంబు బెదిరింపులు

భీమవరంలో బాంబు పెట్టామని సమాచారం రావడం కలకలం రేపింది. ‘పార్లమెంట్‌పై దాడి చేసిన అప్జల్ గురును ఉరేశారు. దీనికి నిరసనగా కాలేజీలో బాంబ్ పెట్టాం’ అంటూ శ్రీవిష్ణు ఎడ్యుకేషన్ సొసైటీలోని డెంటల్ కాలేజీకి బుధవారం మెయిల్ వచ్చింది. వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. దాదాపు 3 గంటలకుపైగా తనిఖీలు చేసి.. బాంబ్ లేదని తేల్చారు. తమిళనాడులోని ఓ వ్యక్తి పేరిట ఈ మెయిల్ వచ్చినట్లు సమాచారం.
Similar News
News November 27, 2025
ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు

చొరబాటుదారులు ఆధార్ పొందడంపై CJI జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. దేశపౌరులు కానివారికి ఆధార్ ఉంటే ఓటు హక్కు కల్పించాలా? అని ప్రశ్నించింది. ఓటరు జాబితాపై EC చేస్తోన్న SIRను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ‘సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చూసుకోవడానికే ఆధార్. ఇది ఓటు హక్కు, పౌరసత్వం, నివాస స్థలాన్ని ఇవ్వదని చట్టంలో స్పష్టంగా ఉంది’ అని పేర్కొంది.
News November 27, 2025
గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ వంటకాలు

TG: డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే ప్రతినిధులకు హైదరాబాద్ బిర్యానీ సహా మరికొన్ని తెలంగాణ వంటకాలను వడ్డించనున్నారు. డబుల్ కా మీఠా, పత్తర్ కా ఘోష్, తెలంగాణ స్నాక్స్ కూడా మెనూలో ఉన్నాయి. తెలంగాణ సంస్కృతిని హైలైట్ చేసేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని CM రేవంత్ ఆదేశించారు. విదేశీ ప్రతినిధులు చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News November 27, 2025
NZSR ఉన్నప్పటికీ దాని ద్వారా జుక్కల్‌కు ప్రయోజనం లేని పరిస్థితి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ జుక్కల్ నియోజకవర్గానికి ప్రయోజనం లేని పరిస్థితి ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. జుక్కల్ నియోజకవర్గానికి సాగు నీరు ఇచ్చే వ్యవస్థ చాలా తక్కువగా ఉందన్నారు. MHతో పంచాయతీ కారణంగా లెండి ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి కాకుండా ఉందని ఆరోపించారు.


