News January 16, 2025
భీమవరంలో కిడ్నాప్ కలకలం

భీమవరం పట్టణంలోని మెంటేవారి తోటకి చెందిన విశ్వనాథుని వెంకట సత్యనారాయణ గురువారం కిడ్నాప్ అయ్యారు. సత్యనారాయణ తమ బంధువులను టౌన్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కించడానికి వచ్చి బయటికు వచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను వారి కారులో ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌కి ఆర్థిక లావాదేవీలే కారణం అని పలువురు అంటున్నారు. ఘటనపై భీమవరం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 10, 2025
అత్తిలి: నంది అవార్డు అందుకున్న టీచర్

అత్తిలి గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు పెద్దపల్లి వెంకటరమణికి బంగారు నంది అవార్డు అందుకున్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక పురస్కారాల అకాడమీ వారు వెంకట రమణికు అవార్డును అందజేశారు. తెలుగు సాహిత్యం, కవిత్వంలో చేసిన కృషికి ఈ అవార్డు లభించినట్లు వెంకటరమణ తెలిపారు. అలాగే తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ జిల్లా అధ్యక్షురాలిగా తనను ప్రకటించినట్లు తెలిపారు.
News February 10, 2025
తణుకులో సందడి చేసిన స్టార్ హీరోలు

తణుకులో స్టార్ హీరోలు ఆదివారం సందడి చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు అత్త యలమర్తి రాజేశ్వరిదేవి ఇటీవల మృతి చెందడంతో ఆదివారం తణుకులో పెద్దకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరోలు వెంకటేష్, రానా విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానులు వారిని కలిసి ఫోటోలు తీసుకున్నారు. కొద్దిసేపు అభిమానులతో వారు ముచ్చటించారు.
News February 9, 2025
రోడ్డుప్రమాదంలో తాడేపల్లిగూడెం మహిళ మృతి

ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.