News March 27, 2025

భీమవరంలో ప్రేమ పేరుతో మోసం

image

ప్రేమంటూ మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరం పట్టణానికి చెందిన ఓ యువతిని గుడిసె ఉదయ్ ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. ఈక్రమంలో 2023 మేలో ఆమెను లోబర్చుకున్నాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటానని చెబుతూ వచ్చాడు. ఇటీవల యువతి గట్టిగా నిలదీయడంతో పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పాడు. ఈనెల 22న యువతి ఫిర్యాదు చేయగా.. ఉదయ్‌ను అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం తణుకు జైలుకు తరలించారు.

Similar News

News December 4, 2025

ప.గో: 594 కిలోల గంజాయి ధ్వంసం

image

పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ స్టేషన్లలో పట్టుబడ్డ గంజాయిని ధ్వంసం చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గుంటూరు జిల్లా కొండవీడు పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ వద్ద ఈ ప్రక్రియ నిర్వహించామన్నారు. మొత్తం 21 కేసులకు సంబంధించిన 594.844 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. ఈ ప్రక్రియకు సహకరించిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News December 4, 2025

ప.గోలో డీడీ‌ఓ కార్యాలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించినున్న పవన్

image

ప.గో. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన డిటిఓ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా నుంచి వర్చువల్‌గా గురువారం ప్రారంభిస్తారని గ్రామ వార్డు సచివాలయ అభివృద్ధి అధికారి దోసిరెడ్డి తెలిపారు. డి ఎల్‌డీ‌ఓలను, డీడీవోలుగా కూటమి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిందన్నారు. ఇందులో జిల్లాలోని విస్సాకోడేరు, నరసాపురం, తాడేపల్లిగూడెం డి డి ఓ కార్యాలయాలు ప్రారంభిస్తారు అన్నారు.

News December 4, 2025

ప.గో: ఈ నెల 14 వరకే ఛాన్స్

image

పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ(పీఎంఏవైజీ) పథకం ప్రారంభించింది. వీటి దరఖాస్తుల గడువు ఇటీవల ముగియగా..లబ్ధిదారుల దృష్ట్యా ఈ నెల 14వరకు పొడిగించింది. గతంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారి వివరాలను ఆన్‌లైన్‌లో తొలగించి..కొత్తగా అవకాశం కల్పించనుంది. ఇంటి ఏర్పాటుకు రూ.2.50 లక్షల రాయితీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనున్నాయి.