News March 13, 2025
భీమవరంలో బాంబు బెందిరింపు.. పలు కోణాల్లో దర్యాప్తు

భీమవరం విష్ణు కళాశాలలో బుధవారం బాంబు పెట్టామన్న ఈ మెయిల్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి నుంచి మెయిల్ వచ్చిననట్లు పోలీసులు గుర్తించారు. పార్లమెంటు దాడి ఘటనలో సూత్రధారి అప్జల్ గురుకు శిక్ష విధించినందుకు నిరసనగా కళాశాలలో బాంబు పెట్టినట్లు ఈ మెయిల్‌లో పేర్కొన్నాడు. అది అతడి నుంచి వచ్చిందా? లేదా మరోకరు పంపించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని DSP జయసూర్య తెలిపారు.
Similar News
News March 21, 2025
ప.గో జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

ప.గో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా భీమవరంలో గురువారం 36.54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గణపవరంలో ఇవాళ దాదాపు 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 21, 2025
భీమవరం: ఉద్యోగికి 15 రోజుల రిమాండ్

నిధుల దుర్వినియోగం కేసులో ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు భీమవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు. వివరాల్లోకి వెళితే… భీమవరం మండలం చినఅమిరం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడైన జూనియర్ అసిస్టెంట్ గుండు రామకృష్ణను అరెస్ట్ చేసి రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ కాళీచరణ్ తెలిపారు.
News March 21, 2025
తానా సభలకు కేంద్రమంత్రి వర్మకు ఆహ్వానం

అమెరికాలో మిచ్ గన్‌లో జూలై 3,4,5 తేదీల్లో జరిగే తానా సభలకు కేంద్రమంత్రి వర్మను ఆహ్వానించారు. అసోసియేషన్ ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ల, కార్యవర్గ సభ్యులు ఢిల్లీలో గురువారం కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. సభ్యులతో సమావేశమైన మంత్రి అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్రా పాల్గొన్నారు.