News September 15, 2024

భీమవరంలో మహిళపై అత్యాచారం..UPDATE

image

భీమవరం టూటౌన్ పరిధిలో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుణ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 11న ఘటన జరగ్గా బాధితురాలు 12న ఫిర్యాదు చేసిందన్నారు. నిందితుడు సీహెచ్.మధుకుమార్‌ను పట్టణంలోని 18వ వార్డులోని అతని ఇంటి వద్ద శనివారం ఉదయం డీఎస్పీ ఆర్.జి.జయసూర్య ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారన్నారు.

Similar News

News October 6, 2024

తిరుపతి వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే RRR

image

ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదివారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు వేద ఆశీర్వచనాలు అందజేశారు.

News October 6, 2024

నరసాపురంలో పదేళ్ల బాలికతో అసభ్యకర ప్రవర్తన

image

పదేళ్ల బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై శనివారం పోక్సో కేసు నమోదుచేశామని నరసాపురం పట్టణ ఎస్సై జయలక్ష్మి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికపట్ల యలమంచిలి మండలం మేడపాడుకు చెందిన యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై తెలిపారు.

News October 6, 2024

ఏలూరు: జాతీయ రహదారి సమస్యలు పరిష్కరిస్తా: MP

image

ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని 216-ఎ- జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల్లో నెలకొన్న రహదారి సమస్యలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటానని ఏలూరు MP పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. శనివారం ఆయన భీమడోలులోని టీడీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఉన్నారు.