News August 16, 2024

భీమవరంలో రేపు ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్

image

పశ్చిమ బెంగాల్‌లోని RG Kar మెడికల్ కాలేజ్‌లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా ఈనెల 17న ఉదయం 6 గంటల నుంచి 18న ఉదయం 6 గంటల వరకు భీమవరంలో వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకరోజు పూర్తిగా వైద్య సేవలు, లేబరేటరీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ నిలిపి వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News November 26, 2025

రైతు ఆర్థిక బలోపేతానికి ‘రైతన్నా.. మీకోసం’: కలెక్టర్

image

రైతును ఆర్థికంగా బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లిలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆమె రైతుల సమక్షంలో నిర్వహించారు. రైతు సత్యనారాయణ రాజు మండువా పెంకుటిల్లు అరుగుపైనే ఈ కార్యక్రమం జరిగింది.

News November 26, 2025

భీమవరం: ఎస్సీ, ఎస్టీ యువతకు సివిల్స్ ఉచిత శిక్షణ

image

రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబరు 26లోపు https://apstudycircle.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 10 నుంచి 4 నెలలపాటు శిక్షణ ఉంటుందని, మహిళా అభ్యర్థులకు 33 శాతం సీట్లు కేటాయించామని ఆయన వివరించారు.

News November 26, 2025

ప.గో జిల్లా.. భారీ వర్షాలు.. హెచ్చరిక

image

ప.గో జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఈనెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సూచించినట్లు జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి, పొలాల్లో తేమ పెరగకముందే వరి కోతకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.