News August 27, 2024
భీమవరంలో రోడ్డు పక్కన మహిళ డెడ్‌బాడీ

భీమవరంలోని 37వ వార్డులో ఉండి రోడ్డు పక్కన జంట కాలువ వద్ద స్థానికులు ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా… సీఐ కాళీచరణ్, వీఆర్వో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐ తెలిపారు. డెడ్‌బాడీ పూర్తిగా కుళ్లిపోయి గుర్తించలేని స్థితిలో ఉందని అన్నారు. కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
Similar News
News April 17, 2026
భీమవరం: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్

భీమవరం కలెక్టరేట్‌లో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. మొత్తం 15 అర్జీలు అందాయని, అందులో ప్రధానంగా వైద్య సహాయం, ఉపాధి, రూ.15 వేల పెన్షన్ మంజూరు వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
News April 17, 2026
ప.గో: లంచావతారాలుగా మారారంటూ రాష్ట్రపతికి ఫిర్యాదు

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి, ఆయన అనుచరుడు తోట గోపిలు లంచావతారాలుగా మారారని అదే పార్టీకి చెందిన నాయకుడు రవికిరణ్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. గోపి కుమారుడు రాజా లంచాల దందా సాగిస్తూ, వీరి దందాను అమరావతిలో కూడా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని, బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా చేయడం తగదని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
News April 17, 2026
ప.గో కలెక్టర్ కీలక ఆదేశాలు

పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూసంబంధిత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. 2025 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 13 విడతల్లో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. జిల్లావ్యాప్తంగా అందిన 553 దరఖాస్తుల్లో 189 పరిష్కరించామని, మిగిలిన 229 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆమె ఆదేశించారు.


