News October 2, 2024
భీమవరంలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

భీమవరం మండలం కొవ్వాడపుంతలో వ్యభిచార గృహంపై దాడి చేసినట్లు సీఐ బి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ ఘటనలో మహిళను అదుపులోకి తీసుకుని ఆమెను విజయవాడ ఉజ్వల గృహానికి తరలించామన్నారు. అలాగే వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న భార్యాభర్తలను కోర్టులో హాజరు పరిచి అనంతరం తణుకు సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
Similar News
News October 20, 2025
భీమవరం: నేడు పీజీఆర్ఎస్ రద్దు

దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం దీపావళి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.
News October 20, 2025
పాలకోడేరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

పాలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దీపావళి సందర్భంగా ఈ సోమవారం రద్దు అయినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
News October 19, 2025
పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం

పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గోదావరి నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. పెనుగొండ ఎస్ఐ కె. గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళ మృతదేహాన్ని నదిలో గుర్తించారు. సిద్ధాంతం వీఆర్వో నాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.