News March 30, 2025
భీమవరం: అత్యాచారం చేసి బెదిరిస్తున్నాడని ఫిర్యాదు

తనను బెదిరించి అత్యాచారం చేశాడని భీమవరానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నాగారాజు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి ఉండే ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి బాధితురాలి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అతని భార్యపై గతంలో పెట్టిన కేసు వాపసు తీసుకోవాలని బెదిరించాడు. ఆపై అత్యాచారానికి పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేశారు. వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. కేసు నమోదైంది.
Similar News
News April 4, 2025
ఆక్వా రైతులపై మరో పిడుగు

సీడ్, ఫీడ్ ధరల పెంపుతో ఇప్పటికే అల్లాడుతున్న ఆక్వా రైతులపై మరో పిడుగు పడింది. భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 26% పన్నులు విధిస్తామని చెప్పడం ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా నుంచి అమెరికా, ఇతర దేశాలకు రొయ్యలు ఎగుమతి అవుతాయి. ఇదే అదునుగా ఎగుమతిదారులు కౌంట్ను బట్టి రూ.20 నుంచి రూ.30 వరకు రేట్లు తగ్గించేశారని రైతులు లబోదిబోమంటున్నారు. ఇలా అయితే సాగు చేయలేమంటున్నారు.
News April 4, 2025
నరసాపురం: లేసు అల్లికదారులతో మాట్లాడిన కలెక్టర్

నరసాపురం మండలం రుస్తుంబాద లేసు పార్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా లేసు అల్లికదారులతో మాట్లాడుతూ నిత్య వినియోగం, బహుమతిగా ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్న లేసు ఉత్పత్తులను తయారుచేసి మార్కెటింగ్ పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లోనూ లేసు అల్లికను తెచ్చి పెట్టుకునేలా నైపుణ్యతను చూపించాలని తెలిపారు.
News April 3, 2025
నరసాపురం: ఉగాది పండక్కి వచ్చి తిరిగి రాని లోకాలకు

నరసాపురం మండలం చిట్టవరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కట్టా నవరత్నం (బాషా) మృతి చెందిన విషయం తెలిసిందే. నవరత్నం హైదరాబాదులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. ఉగాది పండక్కి వచ్చి తిరిగి హైదరాబాదు వెళ్లేందుకు సిద్ధ పడుతున్నాడు. ఈలోగా ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తమకు దిక్కెవరు అంటూ నవరత్నం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వారి తీరు చూపరులకు కంట తడి పెట్టించింది.