News November 24, 2024
భీమవరం: ‘అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి’

భీమవరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి డ్వామా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 368 సీ.సీ, బీ.టీ, డబ్ల్యూబీఎంలు నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయవలసి ఉండగా 318 గ్రౌండ్ కాగా, మొదలు పెట్టని 50 పనులను వెంటనే చేపట్టి డిసెంబర్ నెలాఖరుకి పూర్తి చేయాలని అన్నారు. రోడ్డు నిర్మాణ పనుల పురోగతి కనబర్చకపోతే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News November 22, 2025
ప.గో: హెలికాప్టర్ దిగగానే.. పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఇదిగో!

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 24న ద్వారకాతిరుమల మండలంలో పర్యటిస్తారు. కొయ్యలగూడెం (M) రాజవరంలో హెలిప్యాడ్‌లో దిగి అక్కడ నుంచి ద్వారకాతిరుమల మండలం జగన్నాథపురం చేరుకుంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. ముందుగా ఆయన స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు.
News November 22, 2025
ప.గో: జాతీయ స్థాయి యోగా పోటీలకు ఇరువురి ఎంపిక

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు బడుగు చంద్రశేఖర్ (మోదుగ గుంట), హెచ్. రమాదేవి (చెరుకువాడ) ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో గోవాలో జరగనున్న యోగా పోటీల్లో పాల్గోనున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బడుగు చంద్రశేఖర్ శుక్రవారం రాత్రి తెలిపారు.
News November 21, 2025
ప.గో: రూ. 2కోట్లు గోల్ మాల్ ?

తణుకులోని ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు బంగారం గోల్మాల్ అయిన వ్యవహారం రాజుకుంటోంది. గతంలో ఇక్కడ పనిచేసిన సిబ్బందితో చేతులు కలిపిన తణుకు శాఖ మేనేజర్ ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంత అవసరాలకు వాడుకున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఖాతాదారులు నిలదీయడంతో బ్యాంకు అధికారులు బయట బంగారం కొనుగోలు చేసి ఇచ్చారు. ఇలా సుమారు రూ.2 కోట్లు విలువైన బంగారాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది.


