News March 11, 2025

భీమవరం: ఆన్ లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్

image

ఆన్ లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు ముఠా సభ్యులను ప.గో. జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ జయసూర్య వివరాలు వెల్లడించారు. నలుగురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.13 లక్షల విలువగల 54 మొబైల్ ఫోన్స్, 3 ల్యాప్‌టాప్స్, నెట్వర్కింగ్ డివైసెస్ స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News January 14, 2026

ప.గో: ‘బరి’లో సస్పెన్స్.. పైచేయి ఖాకీదా? ఖద్దరుదా?

image

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఏటా కోడిపందాలు నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. అయితే, ఈ ఏడాది భోగి రోజున ఉదయం 10:40 గంటలు కాస్తున్నా, పందాలకు అనుమతులు లభించలేదు. దీంతో పందెం రాయుళ్లు అనుమతుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది పైచేయి ఖాకీదా ? ఖద్దరుదా ? తేలాల్సి ఉంది. మంగళవారం రాత్రి తాడేపల్లిగూడెం(M) కడియద్ద, కొమ్ముగూడెం, పట్టెంపాలెం, తాడేపల్లిగూడెంలోని బరులను ధ్వంసం చేశారు.

News January 14, 2026

ప.గో జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

సంక్రాంతి పండుగ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నయీమ్ అస్మి హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలతో కోడిపందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలను నిషేధించినట్లు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ప్రజలు చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉండి, కుటుంబాలతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.

News January 12, 2026

ప.గో: నేటి పీజీఆర్ఎస్‌కు 211 అర్జీలు

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 211 అర్జీలు స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.