News October 20, 2024
భీమవరం: ‘ఇసుక సమస్యలపై టోల్ ఫ్రీను సంప్రదించండి’

ఉచిత ఇసుక పొందడానికి సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి టెక్నికల్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం భీమవరంలోని కలెక్టరేట్లో జిల్లా కాల్ సెంటర్ టెక్నికల్ సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక సాంకేతిక సమస్యలపై సమీక్షించారు. అనంతరం ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు 93914 45753, 86882 91997, 81869 39223, 95501 75144 సంప్రదించాలని సూచించారు.
Similar News
News September 18, 2025
భీమవరం: 5 బార్లను లాటరీ

2025-28 సంవత్సరానికి జనరల్ కేటగిరీలో 5 బార్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. భీమవరంలో 4, నర్సాపురంలో 1 బార్‌కు ఒకే అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడంతో వారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి బార్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారి ప్రభు కుమార్ పాల్గొన్నారు.
News September 18, 2025
పాలకోడేరు: గల్లంతైన జైదేవ్ మృతదేహం లభ్యం

పాలకోడేరు మండలం వేండ్ర కట్టా వారిపాలెం గోస్తని నదిలో గల్లంతైన చిన్నారి జైదేవ్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఆదివారం గల్లంతైన అతడి కోసం నాలుగు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు గాలింపు చేపట్టారు. వేండ్ర రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గుర్రపుడెక్కల్లో చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
News September 18, 2025
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. అనుకోకుండా ఉగ్రవాదులు దాడులు జరిపినప్పుడు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఈ మాక్ డ్రిల్ చేశారు. ఆలయంలోనూ, కొండపైన, పరిసరాల్లో ఆక్టోపస్, పోలీస్, అగ్నిమాపక, రెవిన్యూ, వైద్య, దేవస్థానం సిబ్బంది ఈ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు.