News November 9, 2024
భీమవరం: ఉచిత ఇసుకపై కలెక్టర్ సమీక్ష
ఉచిత ఇసుకను వినియోగదారులకు మరింత చెరువ చేయుడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం అధికారులతో సమీక్ష సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వినియోగదారుడు తక్కువ ధరకే ఇసుకను పొందేలా చర్యలు చేపట్టామన్నారు. ఇసుక రవాణాకు వాహనం అవసరమైన వారి కోసం ఫెసిలిటేషన్ సెంటర్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 8, 2024
దత్తత పిల్లలకు హాని జరిగితే చర్యలు: కలెక్టర్
దత్తత పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉంటుందని, దత్తత పిల్లలకు ఎటువంటి హాని జరిగిన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరించారు. శనివారం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పిల్లలు లేని తల్లిదండ్రులకు 7 నెలలు, 13 ఏళ్ల బాలికను కలెక్టర్ చేతుల మీదుగా దత్తత ఇచ్చారు. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని దత్తత తీసుకున్న వారికి సూచించారు.
News December 7, 2024
రవాణా శాఖ తనిఖీల్లో 832 కేసులు నమోదు
ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న రవాణా శాఖ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా 832 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. డిసెంబరు ఒకటవ తేదీ నుంచి ఈరోజు వరకు వివిధ రకాల వాహనాలపై పలు ఉల్లంఘనలకు గాను 832 కేసులు నమోదు చేసి 14 లక్షల 92 వేల రూపాయల అపరాధ రుసుము విధించామన్నారు. విద్యా సంస్థల బస్సులపై 23 కేసులు నమోదు చేశామన్నారు.
News December 7, 2024
చింతలపూడి: తల్లి మృతితో కుమారుడు సూసైడ్
చింతలపూడి(M) వెంకటాద్రి గూడెంలో కృష్ణ బాబు(31) అనే వ్యక్తి శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన కుటుంబీకులు చింతలపూడి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శనివారం చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లి మృతితో కృష్ణబాబు 2 నెలల నుంచి మనస్తాపంతో ఉన్నాడన్నారు.