News February 5, 2025
భీమవరం: ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని మృతి

ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమవరం(M) గునుపూడి గరువపేటలో జరిగింది. డిగ్రీ చదువుతున్న అనూష(19) సత్యనారాయణ అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ నెల 3న ఫోన్లో ఇద్దరికి ఘర్షణ జరిగింది. కాసేపటికి అనూష సోదరికి సత్యనారాయణ ఫోన్ చేసి మీ సోదరి చనిపోతా అంటుంది చూడమని చెప్పాడు. అనూష రూమ్ తలుపులు పగలకొట్టి చూడగా అప్పటికే చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News October 15, 2025
రాజన్న అభివృద్ధి పనులు ఆపుతారా? కొనసాగిస్తారా?

సమ్మక్క సారక్క జాతర ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో భక్తుల రద్దీ లక్షల్లో ఉంటుంది. ఈ సమయంలో అభివృద్ధి పనులు కొనసాగితే భక్తులకు తీవ్ర అకసౌకర్యం ఏర్పడుతుంది. అటు అభివృద్ధి పనులు, ఇటు దర్శనాలు ఒకే సమయంలో జరిగితే లక్షల్లో భక్తులను కంట్రోల్ చేయడం కష్టంగా మారుతుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
News October 15, 2025
విజయవాడ: గేదెలపై పడ్డ దొంగల కళ్లు!

ఎన్టీఆర్ జిల్లాలో ఓ దొంగల ముఠా కళ్లు గేదెలపై పడ్డాయి. పాలు, వాటి అనుబంధ పదార్థాల ధరలు పెరగడంతో గేదెల విలువ బాగా పెరిగింది. రూ.లక్ష వరకు ధర ఉంటోంది. ఈ నేపథ్యంలో ఓ ముఠా గేదెలు ఎత్తుకుపోతోంది. బొలేరో, టాటా ఏస్ వంటి వాహనాల్లో వచ్చి గేదెలను అందులోకి ఎక్కించి దొంగిలించుకుపోతున్నారు. ఈ క్రమంలో విజయవాడ CCS పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఠా మొత్తాన్ని పట్టుకునే పనిలో పడ్డారు.
News October 15, 2025
ప్రభుత్వం వినూత్న నిర్ణయం.. ఖమ్మం నుంచే షురూ..!

ప్రభుత్వం పచ్చదనంతో పాటు ఆదాయం కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలోచనతో ప్రభుత్వ స్థలాలు, రహదారులు, బీడు భూముల్లో ఆయిల్‌పామ్ మొక్కలు పెంచి పచ్చదనంతో పాటు ఆదాయం పొందేందుకు కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఉమ్మడి ఖమ్మంను మోడల్‌గా తీసుకుని అన్ని ప్రభుత్వ విభాగాలలో ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. ఈ స్థలాల్లో మొక్కలను నాటడం ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదాయం లభించనుంది.