News May 24, 2024
భీమవరం: కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకిన స్టూడెంట్

భీమవరంలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి అదే కాలేజ్ భవనం పైనుంచి దూకేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. మొదటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చిన అతడి ప్రవర్తనలో ఇటీవల మార్పు వచ్చింది. రోజులాగే బుధవారం కళాశాలకు వెళ్లిన విద్యార్థి.. హఠాత్తుగా భవనం పైనుంచి దూకేశాడు. తీవ్రగాయాలు కాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా.. దీనిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Similar News
News December 10, 2025
రాయకుదురు: ‘టెన్త్ విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక అమలు చేయాలి’

పదో తరగతి విద్యార్థులకు నిర్ణయించిన ప్రణాళికను అనుసరించి వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలని ఉపవిద్యా శాఖ అధికారి ఎన్. రమేష్ అన్నారు. బుధవారం రాయకుదురు జడ్పీ హైస్కూల్ను ఆయన తనిఖీ చేశారు. హై స్కూల్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ హైస్కూళ్లకు చెందిన హెచ్ఎంలతో పాటు సబ్జెక్టులకు సంబంధించిన ప్యానల్ మెంబర్స్తో సమావేశం నిర్వహించారు. విద్యాభివృద్ధికి పలు సూచనలు ఇచ్చారు.
News December 10, 2025
పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి: కలెక్టర్

పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం ఆమె కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఇన్వెస్టర్లతో ముఖాముఖి మాట్లాడారు. నూతన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాల మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
News December 9, 2025
రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తాం: కలెక్టర్

ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని, దీనిలో భాగంగానే ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ విశ్వవిద్యాలయం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RJY)తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. తద్వారా ఉద్యాన రంగంలో మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు.


