News January 23, 2025
భీమవరం: కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

భీమవరంలో ఈ నెల 17 నుంచి కనిపించకుండా పోయిన మైనర్ బాలిక ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా ప్రత్యేక బృందాలతో గాలించి బాలిక పాలకొల్లు బస్టాండ్‌లో ఉన్నట్లు గుర్తించి తీసుకొచ్చారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడని, అతని మాటలు నమ్మి వెళ్లిపోయినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. కాగా పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని పోలీసులు సూచించారు.
Similar News
News April 11, 2026
వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది పొడిగింపు: కలెక్టర్

జిల్లాలోని జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు అమలు చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను మరో ఏడాది అనగా 2026-27కు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ జీఓఎంస్ సంఖ్య 43 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
News April 11, 2026
ప.గో: పెళ్లింట తీవ్ర విషాదం

పెదవేగిలోని వలసపల్లి సమీపంలో <<19612501>>గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతలపూడి(M)ముక్కంపాడుకు<<>> చెందిన సచివాలయ ఉద్యోగి సుధీర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇతని భార్య గర్భిణీ. అంతేకాకుండా మరోవైపు మృతుని సోదరునికి ఈ నెల 25న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోవడంతో పెళ్లింట శోక సంద్రంలో మునిగిపోయారు.
News April 10, 2026
పర్యావరణహితంగా వినాయక చవితి: కలెక్టర్

వినాయక చవితి ఉత్సవాల్లో పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలనే వాడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. భీమవరం కలెక్టరేట్‌లో పొల్యూషన్ బోర్డ్ అధికారులతో కలిసి నిర్వహించిన ముందస్తు సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో తయారైన విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు.


