News October 29, 2024
భీమవరం కుర్రాడిని కలుస్తానన్న మంత్రి లోకేశ్
భీమవరానికి చెందిన యువకుడు యేసు భీమవరం నుంచి సైకిల్‌పై లద్దాక్‌కు 3500 కి.మీ. ప్రయాణించి ఎక్స్‌లో పోస్టు చేశారు. దానిపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘నేను ఇండియాకి వచ్చాక నిన్ను కలుస్తాను. సవాలుతో కూడిన నీ ప్రయాణం విజయవంతంగా ముగిసినందుకు అభినందనలు. ఇలాగే పట్టుదలతో నువ్వు లక్ష్యాన్ని చేరుకోవడాన్ని కొనసాగించు’ అని మంత్రి రిప్లై ఇచ్చారు.
Similar News
News November 7, 2024
ఏలూరు: గోల్డ్ మెడల్ సాధించిన ARDGK విద్యార్థులు
ఏలూరు ARDGK విద్యార్థులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే కీర్తన, పావని గోల్డ్ మెడల్ సాధించగా.. హారిక రెడ్డి రజత పతకం, పవిత్ర, మేఘన, నిహారిక కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారని ప్రధానోపాధ్యాయురాలు ఉజ్వల గురువారం తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి హెచ్ఎం విజయ్ కుమార్, సోషల్ వర్కర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.
News November 7, 2024
ప.గో రైతులకు గమనిక
ప.గో.జిల్లాలో 22 రైతు సేవా కేంద్రాల ద్వారా 128 మంది రైతుల నుంచి 11,770 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత సీజన్‌లో కనీస మద్దతు ధర క్వింటాల్ సాధారణ రకం రూ.2,300, గ్రేడ్-ఏ రకం రూ.2,320 చొప్పున నిర్ణయించినట్లు చెప్పారు. ధాన్యం విక్రయాలకు సంబంధించి సమస్యలుంటే కంట్రోల్ రూం 8121676653కు ఫోన్ చేయాలన్నారు.
News November 7, 2024
కడప జిల్లాలో ప.గో వ్యక్తి దారుణ హత్య
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కడప జిల్లాలో దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. పెనుమంట్ర మండలం బొక్కావారిపాలెంకు చెందిన వెంకటనారాయణ(40) కొద్ది రోజుల నుంచి రైల్వేకోడూరు మండలం ఉర్లగట్టుపోడులో ఉంటూ, టైల్స్ వేసేపని చేస్తూ ఉండేవాడు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.