News November 23, 2024
భీమవరం: కేంద్ర మంత్రికి జిల్లా ప్రముఖులు పరామర్శలు
పితృవియోగం పొందిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మను పలువురు నేతలు శనివారం పరామర్శించారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు, మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, ఆరమిల్లి రాధాకృష్ణ, ధర్మరాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 8, 2024
జీలుగుమిల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం గ్రామ శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. జీలుగుమిల్లి మండలం అంకంపాలెంకి చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. అటుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 8, 2024
రవాణా శాఖ తనిఖీల్లో 832 కేసులు నమోదు
ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న రవాణా శాఖ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా 832 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. డిసెంబరు ఒకటవ తేదీ నుంచి ఈరోజు వరకు వివిధ రకాల వాహనాలపై పలు ఉల్లంఘనలకు గాను 832 కేసులు నమోదు చేసి 14 లక్షల 92 వేల రూపాయల అపరాధ రుసుము విధించామన్నారు. విద్యా సంస్థల బస్సులపై 23 కేసులు నమోదు చేశామన్నారు.
News December 8, 2024
దత్తత పిల్లలకు హాని జరిగితే చర్యలు: కలెక్టర్
దత్తత పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉంటుందని, దత్తత పిల్లలకు ఎటువంటి హాని జరిగిన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరించారు. శనివారం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పిల్లలు లేని తల్లిదండ్రులకు 7 నెలలు, 13 ఏళ్ల బాలికను కలెక్టర్ చేతుల మీదుగా దత్తత ఇచ్చారు. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని దత్తత తీసుకున్న వారికి సూచించారు.