News January 26, 2025

భీమవరం: గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన జెసీ 

image

భీమవరం కలెక్టరేట్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఏర్పాట్లు చేయడం చేస్తున్నట్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించేలా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

Similar News

News December 2, 2025

ఏలూరు: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్

image

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీనియర్స్, జూనియర్స్ మధ్య వివాదం చెలరేగింది. కాలేజీ ఫెస్ట్‌కు సంబంధించి పనుల్లో భాగంగా సోమవారం 3rd ఇయర్ విద్యార్థులకు జూనియర్లకు మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సీనియర్స్ తమపై ర్యాగింగ్ చేస్తున్నారని, రాత్రి సమయంలో బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని జూనియర్స్ ఆరోపించారు. సమాచారం అందుకున్న 2 టౌన్ CI అశోక్ కుమార్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

News December 1, 2025

మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులు సత్కరించిన కలెక్టర్

image

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ భీమవరం కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాక్ అసెంబ్లీలో ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

News December 1, 2025

జిల్లాలో రోడ్లు అభివృద్ధికి రూ.37.70 కోట్లు నిధులు: కలెక్టర్

image

ప.గో. జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి, కోపల్లె బ్రిడ్జి నిర్మాణానికి రూ.37.70 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర రహదారులు, జిల్లాలోని ప్రధాన రహదారులు అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆమె సోమవారం తెలిపారు. ఉండి నియోజకవర్గంలో కోపల్లె బ్రిడ్జి నిర్మాణానికి రూ.12 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ఆమె వెల్లడించారు.