News March 8, 2025

భీమవరం: డీఎస్సీ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు

image

ప.గో జిల్లా పరిధిలోని బీసీ, ఈబీసీ సామాజిక వర్గాలకు డీఎస్సీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ సాధికారత అధికారి గణపతిరావు తెలిపారు. కలెక్టరేట్లో ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. బీఈడీ, టీటీసీతోపాటు టెట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News February 28, 2026

భీమవరం: ఆహార భద్రతపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆహార భద్రత, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పాలు, నెయ్యి, వెన్న వంటి పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానం, నమూనాల ల్యాబ్ పరీక్షలపై దిశానిర్దేశం చేశారు.

News February 27, 2026

కలెక్టరుకు చాక్‌పీస్‌ మైక్రోఆర్ట్‌ బహూకరణ

image

పెరవలి మండలం తీపర్రుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కోడూరి రాఘవేంద్ర బాబు తన ప్రతిభతో కలెక్టరును ఆకట్టుకున్నారు. చాక్‌పీస్‌పై కలెక్టర్ చదలవాడ నాగరాణి పేరును అద్భుతంగా చెక్కి, శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమెకు అందజేశారు. ఈ కళాఖండాన్ని చూసి విస్మయం చెందిన కలెక్టర్.. రాఘవేంద్ర బాబును ప్రత్యేకంగా అభినందించారు. తన పేరును ఇంత సూక్ష్మంగా, కళాత్మకంగా చెక్కడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.