News November 27, 2024

భీమవరం నుంచి మలేషియా పంపి మోసం

image

మలేషియా పంపి మోసం చేసిన ఘటన భీమవరంలో జరిగింది. ‘నేను భీమవరంలోని మోటుపల్లివారి వీధిలో ఉంటున్నా. ప్రకాశ్ నగర్‌కు చెందిన ఓ మహిళ రూ.1.50 లక్షలు తీసుకుని పంబ్లింగ్ పని కోసం నన్ను మలేషియా పంపింది. కానీ ఓ హోటల్లో పనికి పెట్టి జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. తిరిగి భీమవరం పంపాలని నా భార్య ఆ మహిళను కోరినా పట్టించుకోలేదు. తెలిసిన వాళ్ల ద్వారా భీమవరం వచ్చా’ అని బాధితుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News December 2, 2024

అర్జీదారులకు గమనిక: ఏలూరు కలెక్టర్

image

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను సోమవారం నుంచి మండల, డివిజనల్ ,మున్సిపల్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చునన్నారు.

News December 1, 2024

తండ్రి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు: కేంద్రమంత్రి

image

తన తండ్రి భూపతి రాజు సూర్యనారాయణ రాజు పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆదివారం ప్రకటించారు. భీమవరంలో తన తండ్రి సంస్మరణ సభలో శ్రీనివాస వర్మ మాట్లాడారు. తన తండ్రి వల్లే ఈ స్థాయికి చేరానని అన్నారు. రాబోయే రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు. డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని అన్నారు.

News December 1, 2024

వెలవెలబోయిన పేరుపాలెం బీచ్

image

కార్తీక మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే పర్యాటకులతో కళకళలాడే పేరుపాలెం బీచ్ ఆదివారం వెలవెలబోయింది. అల్పపీడనం ఎఫెక్ట్‌తో బీచ్‌లో పెద్ద పెద్ద రాకాసి అలలు వస్తుండడంతో పోలీస్ యంత్రాంగం పర్యాటకులను రావొద్దని హెచ్చరించింది. దీంతో పర్యాటకులు బీచ్‌కు రాకపోవడంతో ఖాళీగా దర్శనమిచ్చింది.