News February 14, 2025
భీమవరం: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

భీమవరం కలెక్టరేట్ లో పదో తరగతి పరీక్షల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ నాగరాణి సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మార్చి 17 నుంచి 31 వరకు 10వ తరగతి రెగ్యులర్ వారికి, 17 నుంచి మార్చి 28 వరకు ఓపెన్ స్కూల్స్ విద్యార్ధులకు పరీక్షలు జరుగుతాన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు జరుగుతాయన్నారు. రెగ్యులర్, ప్రైవేటు కలిపి జిల్లాలో 128 కేంద్రాల్లో 24,393 మంది విద్యార్ధులు హాజరవుతారన్నారు.
Similar News
News March 12, 2025
కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మకి తప్పిన ప్రమాదం

కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని పార్లమెంట్ సమావేశానికి హాజరై అనంతరం మంత్రిత్వశాఖ కార్యాలయానికి వెళ్తుండగా ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ఆయన కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొంది. వర్మ కాలికి తీవ్ర గాయమైంది. వైద్య బృందం ప్రత్యేక చికిత్స అందించారు. కాలికి బలమైన గాయం కావడం వల్ల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఢిల్లీ నుంచి భీమవరానికి ఆయన బయలుదేరారు.
News March 12, 2025
భీమవరం పట్టణంలో బాంబు బెదిరింపు కలకలం

భీమవరం పట్టణంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీలోని డెంటల్ కళాశాలకు బుధవారం మధ్యాహ్నం మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీనితో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కాలేజ్ యాజమాన్యం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 12, 2025
హైదరాబాద్‌లో పోడూరు యువకుడు మృతి

పోడూరుకి చెందిన రోహిత్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే. రోహిత్ తల్లి బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లారు. సమాచారం తెలియడంతో ఆమె స్వగ్రామానికి బయలుదేరారు. ఇటీవల భర్త మరణించగా ఆ బాధ నుంచి తెరుకోక ముందే కొడుకు మృతితో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని బంధువులు తెలిపారు. మృతదేహన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.