News March 29, 2025
భీమవరం : బాలికపై తండ్రి వరుసయ్యే వ్యక్తి లైంగిక వేధింపులు

కన్నతండ్రిలా చూసుకోవాల్సిన వ్యక్తే బాలికపై కన్నేసిన ఘటన భీమవరంలో జరిగింది. 2 టౌన్ SI ఫాజిల్ రెహ్మాన్ కథనం..భర్తతో విడిపోయిన మహిళ ఇద్దరి కుమార్తెలతో.. వచ్చేసి పదేళ్ల నుంచి సత్యవతి నగర్లో కే.గణేశ్‌తో సహజీవనం చేస్తోంది. అతనితోనూ ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆమె ఇంట్లో లేనప్పుడు మొదటి భర్తకు జన్మించిన బాలికను లైంగికంగా వేధించేవాడు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News April 3, 2025
నరసాపురం: ఉగాది పండక్కి వచ్చి తిరిగి రాని లోకాలకు

నరసాపురం మండలం చిట్టవరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కట్టా నవరత్నం (బాషా) మృతి చెందిన విషయం తెలిసిందే. నవరత్నం హైదరాబాదులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. ఉగాది పండక్కి వచ్చి తిరిగి హైదరాబాదు వెళ్లేందుకు సిద్ధ పడుతున్నాడు. ఈలోగా ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తమకు దిక్కెవరు అంటూ నవరత్నం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వారి తీరు చూపరులకు కంట తడి పెట్టించింది.
News April 3, 2025
గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం అభినందనీయం: కలెక్టర్

రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఓఎన్‌డీసీ ప్లాట్ ఫారమ్ ద్వారా అమ్మి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో గిన్నిస్ బుక్ రికార్డ్స్ సర్టిఫికెట్లను మెప్మా అధికారులు జిల్లా కలెక్టర్‌కు చూపించారు.
News April 3, 2025
ప.గో: జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి..కలెక్టర్

ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్ఆర్‌జీఎస్ పనుల లక్ష్యాలకు మించి సాధించి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. జిల్లాలో 1,81,101 జాబ్ కార్డులు నమోదు కాబడ్డాయన్నారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో 39 లక్షల పని దినాలు లక్ష్యం కాగా 37.71 లక్షల పని దినాలు కల్పించి 96.69 శాతానికి పైగా లక్ష్యం సాధించి పని కోరిన 1,02,792 కుటుంబాలకు పని కల్పించడం జరిగిందన్నారు.