News January 17, 2025

భీమవరం మావుళ్లమ్మను దర్శించున్న శ్యామలా దేవి

image

భీమవరం శ్రీమావుళ్లమ్మ అమ్మవారిని ప్రతి సంవత్సరం దర్శించుకుంటానని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి అన్నారు. శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని చీర అందించారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేశ్ స్వాగతం పలికి ఆలయ అర్చకులచే ప్రత్యేక పూజలను నిర్వహించి, సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మొగల్తూరులో కృష్ణంరాజు, సూర్యనారాయణరాజు పేరిట షుగర్ వ్యాధి ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు.

Similar News

News February 15, 2025

భీమవరం : గాయపడిన బాలుడి మృతి

image

భీమవరంలో ఈనెల 12న కోటేశ్వరరావు అనే బాలుడుకి(10) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కొక్కి తగులుకుని కొంత దూరం లాక్కెళ్లింది. దీంతో గమనించిన స్థానికులు బాలుడిని ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 13న మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బాలుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.

News February 15, 2025

పాలకొల్లు వాసి ఆత్మహత్య

image

ప.గో జిల్లా పాలకొల్లు ప్రాంతానికి చెందిన చందనాలస్వామి(36) శ్రీకాకుళం జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యం కారణంగా టెక్కలిలోని ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచినీటి ప్రాజెక్ట్ ట్యాంకులో దూకి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం మృతదేహాన్ని గుర్తించి, అతను టెక్కలి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల మెస్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు.

News February 15, 2025

ప.గో: ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యాన్ని నెరవేర్చాలి..కలెక్టర్ 

image

ఇల్లు కట్టుకోవాలనే ప్రతి ఒక్కరి లక్ష్యాన్ని నెరవేర్చేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో పీఎంఏవై-ఎన్టీఆర్ కాలనీ గృహ నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాల లక్ష్య సాధనలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలన్నారు.

error: Content is protected !!