News January 28, 2025
భీమవరం వాసికి అరుదైన అవకాశం

ప.గో జిల్లా వాసికి అరుదైన అవకాశం లభించింది. భీమవరానికి చెందిన చల్లా ధనంజయ ఏపీ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్‌గా సెలక్టయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆర్డర్స్ ఇచ్చింది. 1983 నుంచి ఆయన లాయర్‌గా పనిచేస్తున్నారు. 1987 వరకు రాజమండ్రిలో వర్క్ చేసిన ఆయన.. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారు. 2022లో సీనియర్ లాయర్ గుర్తింపు దక్కింది. తాజా పదవి ప్రకారం ఆయన.. ఏపీ హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తారు.
Similar News
News February 13, 2025
‘గూడెం’లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం

తాడేపల్లిగూడెం పట్టణం తాలూకా ఆఫీస్ ప్రాంగణంలో పార్క్ చేసి ఉన్న కియా కారు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైనట్లు అగ్నిమాపక దళాధికారి జీవీ రామారావు బుధవారం తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు అదుపు చేసినట్లు వివరించారు. కారు విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందన్నారు. ఫైర్ సిబ్బంది కే. శ్రీశైలం, గురుప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
News February 12, 2025
ప.గో జిల్లాలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు

బర్డ్ ఫ్లూ ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. నిన్న మొన్నటి వరకు కిలో రూ .240 వరకు విక్రయించిన చికెన్ , ప్రస్తుతం రూ. 160 నుంచి రూ. 180 వరకు విక్రయిస్తున్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో చికెన్ విక్రయాలు ఇప్పటికే నిలిపివేయగా మిగిలిన ప్రాంతాల్లో మాత్రం వినియోగదారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు.
News February 12, 2025
ఏలూరులో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నిందితులు

ఏలూరులో మసాజ్ సెంటర్లపై టూటౌన్ సీఐ రమణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఎస్ఎస్ కాల్ సెంటర్లో బ్యూటీపార్లర్ ట్రైనింగ్ కోర్సు పేరుతో యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని పలువురు ఆరోపించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు దాడి చేసి కాల్ సెంటర్ నిర్వాహకుడు నాగార్జున, మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.