News January 19, 2025
భీమవరం: వ్యక్తి కిడ్నాప్‌లో ట్విస్ట్

భీమవరంలో ఈనెల 16న వెంకట సత్యనారాయణ(నాని) కిడ్నాపైన విషయం తెలిసిందే. అయితే కిడ్నాప్‌కు అనంతపురం వాసులు ఇద్దరితో ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది. నానిని కిడ్నాప్ చేసి బకాయిలు వసూలు చేయాలని పథకం వేశారు. రైల్వే స్టేషన్ వద్ద ఒంటరిగా ఉన్న అతడిని ఇంటిలిజెన్స్ పోలీసులమని చెప్పి కిడ్నాప్ చేశారు. నాని కుమారుడి ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించారు. త్వరలో నిందితులను చూపించే ఛాన్స్ ఉంది.
Similar News
News February 11, 2025
కోకోకు ధర కల్పించాలంటూ సీఎం దృష్టికి..

అంతర్జాతీయ మార్కెట్‌కు తగ్గట్టుగా కోకోకు ధర కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబును కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కోకో రైతులతో ఆయన స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా కోకో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు వివరించారు. ఎమ్మెల్యే వెంట వట్టికూటి వెంకట రామారావు, గారపాటి శ్రీనివాస్, వీర్రాజు ఉన్నారు.
News February 10, 2025
అత్తిలి: నంది అవార్డు అందుకున్న టీచర్

అత్తిలి గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు పెద్దపల్లి వెంకటరమణికి బంగారు నంది అవార్డు అందుకున్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక పురస్కారాల అకాడమీ వారు వెంకట రమణికు అవార్డును అందజేశారు. తెలుగు సాహిత్యం, కవిత్వంలో చేసిన కృషికి ఈ అవార్డు లభించినట్లు వెంకటరమణ తెలిపారు. అలాగే తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ జిల్లా అధ్యక్షురాలిగా తనను ప్రకటించినట్లు తెలిపారు.
News February 10, 2025
తణుకులో సందడి చేసిన స్టార్ హీరోలు

తణుకులో స్టార్ హీరోలు ఆదివారం సందడి చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు అత్త యలమర్తి రాజేశ్వరిదేవి ఇటీవల మృతి చెందడంతో ఆదివారం తణుకులో పెద్దకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరోలు వెంకటేష్, రానా విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానులు వారిని కలిసి ఫోటోలు తీసుకున్నారు. కొద్దిసేపు అభిమానులతో వారు ముచ్చటించారు.