News February 12, 2026

భీమవరం: స్టేషన్ రికార్డుల నిర్వహణపై ఐజీ ఆకస్మిక తనిఖీ

image

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా ఐజీ అశోక్ కుమార్ పరిపాలన, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా మహిళా రక్షణ, పోక్సో, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు తీరును విశ్లేషించారు. నేరాల నియంత్రణకు రాత్రిపూట గస్తీని మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News March 6, 2026

ఆక్వా రైతుల నమోదును వేగవంతం చేయాలి: జేసీ

image

జిల్లాలోని ఆక్వా రైతుల సమస్యలపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం భీమవరం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ, తూనికలు-కొలతలు, వాణిజ్య పన్నులు, ఎంపెడ అధికారులతో సమీక్షించారు. ఆక్వా రైతులంతా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే, ఆక్వా ఫీడ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.

News March 5, 2026

భీమవరం: మహిళా దినోత్సవ నిర్వహణపై జేసీ సమీక్ష

image

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం విష్ణు కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేడుకల నిర్వహణకు ప్రత్యేక అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళా సాధికారత ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాలు ఉండాలని ఆయన సూచించారు.