News January 26, 2025
భీమవరానికి హీరో వెంకటేశ్, మీనాక్షి చౌదరి

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మీట్ ఆదివారం భీమవరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఎస్ఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మీట్కి హీరో వెంకటేశ్, హీరోయిన్లు, ఏలూరు జిల్లా బుల్లిరాజు, మరికొంత మంది నటులు సందడి చేయనున్నారు. ఈ సినిమా రిలీజైన రోజే రూ.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని చిత్ర బృందం పేర్కొంది.
Similar News
News November 18, 2025
ADB: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు: డీఈఓ

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ఫెయిల్ విద్యార్థుల పరీక్ష రుసుమును చెల్లించేందుకు తేదీలను పొడిగిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో ఇంటర్ గేషన్ సైబర్ ట్రెజరీ ద్వారా ఫీజు చెల్లించాలని తెలిపారు. పరీక్ష రుసుముల వివరాల కోసం http://bse.telangana.gov.in వెబ్సైట్ను చూడాలని ఆయన సూచించారు.

తెలంగాణ న్యూస్ అప్డేట్స్

*ఈ నెల 25న మరోసారి రాష్ట్ర క్యాబినెట్ భేటీ. 50% రిజర్వేషన్పై నివేదిక ఇవ్వాలని డెడికేషన్ కమిషన్కు క్యాబినెట్ సిఫార్సు.
* రైతులు, మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రానికి రావాలని సీసీఐకి మంత్రి తుమ్మల విజ్ఞప్తి.
* అసదుద్దీన్ ఒవైసీ మాతో కలిసి ఉన్నా లేకపోయినా చేతి గుర్తుకు మద్దతు ఇచ్చారు. ప్రభుత్వంతో కలిసి ఉన్నామని చెప్పకనే చెప్పారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతాయి: PCC చీఫ్ మహేశ్ కుమార్