News July 6, 2024
భీమసింగి: తుప్పల్లో 7 రోజుల ఆడ శిశువు లభ్యం

జామి మండలం భీమసింగి శివారులో గురువారం రాత్రి రోడ్డు పక్కన తుప్పల్లో రోజుల వయసున్న ఆడ శిశువు దొరికినట్లు స్థానికులు తెలిపారు. విషయాన్ని అంగన్వాడీలకు తెలుపగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. శుక్రవారం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమచారం అందించారు. ICDS ప్రాజెక్ట్ సూపర్వైజర్ ఎస్.కృష్ణవేణి స్పందించి జిల్లా ఘోషా ఆసుపత్రికి తరలించారు. పాపకు 7రోజుల వయసు ఉంటుందని వైద్యులు తెలిపారు.
Similar News
News November 15, 2025
ఉపాధి హామీలో లక్ష్యాలు పూర్తి చేయాలి: VZM కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద రోజువారీ లక్ష్యాలను పూర్తి చేసి, ప్రతి కుటుంబానికి 100 రోజుల పనులు శాత శాతంగా అందించాల్సిన అవసరాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉపాధి పనులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, డ్వామా పథక సంచాలకులు, ఏపీడీలు, ఏపీవోలు, ఎంపీడీవోలతో మండల వారీ పురోగతిని సమీక్షించారు. పనిదినాలు, కనీస వేతనాలు, హాజరు శాతం వంటి అంశాలపై విశ్లేశించారు.
News November 15, 2025
ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి: ఎస్.కోట సీఐ

ఎస్.కోట అగ్నిమాపక కేంద్రంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ (39) వెన్ను, కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు CI నారాయణ మూర్తి తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. సెలవుపై ఇంటిలోనే ఉంటున్నాడు. ఈనెల 13న పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అతని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
News November 15, 2025
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దారులు: మంత్రి కొండపల్లి

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు విజన్‌తో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆరంభించిన ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి భారీ స్పందన రావడం రాష్ట్ర ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్‌తో పాటు వివిధ రంగాల వారీగా నిపుణులు సమ్మిట్‌లో పాల్గొన్నారన్నారు.


