News February 6, 2025
భీమారం: తాళం వేసిన ఇంట్లో చోరీ
భీమారంలోని ఐటీడీఏ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. భీమారం ఎస్ఐ శ్వేత వివరాల ప్రకారం.. రాంటెంకి రంజిత్ కుమార్ జనవరి 31న తన కొడుకు అక్షరాభ్యాసం కోసం సిద్దిపేట మండలంలోని శనిగారం గ్రామానికి వెళ్లాడు. కాగా ఈనెల 5న ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి బీరువాలో రూ.50వేల నగదు, రూ.42వేల విలువ గల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News February 7, 2025
ఏలూరు ఆర్‌ఐవోగా యోహన్
ఏలూరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి(ఆర్ఐవో)గా కె.యోహన్ నియమితులయ్యారు. ఏలూరు కోట దెబ్బ ప్రాంతంలోని కార్యాలయంలో ఆయన గురువారం బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత కలెక్టర్ వెట్రి సెల్విని కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఆగిరిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ ఏలూరు జిల్లా ఆర్ఐఓవోగా నియమితులయ్యారు.
News February 7, 2025
గాజా స్వాధీనంపై ట్రంప్‌ది గొప్ప ఆలోచన: నెతన్యాహు
గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<15364652>>వ్యాఖ్యలను<<>> ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించారు. ఆయన చేసిన ప్రతిపాదనలో తప్పు లేదని, గొప్ప ఆలోచన అని చెప్పారు. నిజంగా అది అమల్లోకి వస్తే గాజా ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. కాగా గాజా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనను అరబ్ దేశాలు ఖండించిన విషయం తెలిసిందే.
News February 7, 2025
సోనూసూద్ అరెస్ట్‌కు వారెంట్
నటుడు సోనూసూద్‌కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. మోహిత్ అనే వ్యక్తి ‘రిజికా కాయిన్’లో పెట్టుబడి పేరుతో ₹10L మోసం చేశాడని, దీనికి సోనూసూద్ సాక్షి అని పేర్కొంటూ రాజేశ్ అనే లాయర్ కేసు వేశారు. కోర్టు పంపిన సమన్లకు సోనూసూద్ స్పందించకపోవడంతో జడ్జి తీవ్రంగా స్పందించారు.