News February 6, 2025

భీమారం: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

భీమారంలోని ఐటీడీఏ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. భీమారం ఎస్ఐ శ్వేత వివరాల ప్రకారం.. రాంటెంకి రంజిత్ కుమార్ జనవరి 31న తన కొడుకు అక్షరాభ్యాసం కోసం సిద్దిపేట మండలంలోని శనిగారం గ్రామానికి వెళ్లాడు. కాగా ఈనెల 5న ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి బీరువాలో రూ.50వేల నగదు, రూ.42వేల విలువ గల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News March 19, 2025

2008 నుంచి IPL ఆడుతున్న వారు వీరే

image

ఇప్పటివరకు ఐపీఎల్‌లో వేలాది మంది క్రికెటర్లు ఆడారు. కానీ కొందరు మాత్రమే ఆరంభ సీజన్ నుంచి రాబోయే సీజన్‌లో కూడా ఆడబోతున్నారు. వీరిలో స్వప్నిల్ సింగ్, అజింక్య రహానే, మనీశ్ పాండే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికీ ఆడుతున్నారు. అందరూ భారతీయులే కావడం విశేషం. మరోసారి తమ ప్రదర్శనతో అలరించడానికి వీరు సిద్ధమవుతున్నారు.

News March 19, 2025

VZM: ZP ఛైర్మన్‌కు మాజీ CM జగన్ పరామర్శ

image

విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ రెండో కుమారుడు ప్రణీత్ బాబు బుధవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్‌లో చిన్న శ్రీనును పరామర్శించారు. మృతికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. చిన్న శ్రీను కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మనోధైర్యంగా ఉండాలంటూ జగన్ ధైర్యం చెప్పారు.

News March 19, 2025

మంత్రివ‌ర్గ ఉప సంఘం భేటీలో నెల్లూరు మంత్రులు

image

అమరావతిలోని సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం భేటీ అయ్యింది. ఈ భేటీకి నెల్లూరు మంత్రులు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, పొంగూరు నారాయ‌ణ హాజ‌ర‌య్యారు. భూ పరిపాలన సంస్కరణలపై వారు చ‌ర్చించారు. ప్ర‌ధానంగా మంత్రి వ‌ర్గ ఉప సంఘంలో ఫ్రీ హోల్డ్ భూములపై చ‌ర్చ సాగింది.

error: Content is protected !!