News January 14, 2025

భీమారం: రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలిక దుర్మరణం

image

ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నాలుగేళ్ల అద్వైకరాజ్ దుర్మరణం చెందింది. మంతెన రాజ్ కుమార్ తన భార్య సురేఖ, కుమార్తె అద్వైకరాజ్, తల్లి లక్ష్మమ్మ, మేనకోడలు తేజశ్రీతో కలిసి తమిళనాడులోని ఒక చర్చికి వెళ్లి సోమవారం తిరిగి వస్తుండగా కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Similar News

News February 14, 2025

ADB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

image

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.

News February 14, 2025

ADB: ఆధార్ సెంటర్ పర్యవేక్షించిన UIDAI అధికారి

image

రాష్ట్ర UIDAI ఆఫీస్ హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజర్ నరేశ్ చంద్ర గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలోని ఆధార్ సెంటర్, ఈ సేవా ఆధార్ సెంటర్‌ని తనిఖీ చేశారు. ఆధార్ ఎన్రోల్మెంట్‌ వివరాలను, రికార్డ్ రిజిస్టర్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. తనిఖీలో EDM రవి, మీసేవ ఫ్రాంచైజీ ఓనర్ తన్వీర్, జోగు సాగర్, స్వాగత, దయాకర్, శేషగిరి ఉన్నారు.

News February 14, 2025

సారంగాపూర్‌: పాముకాటుతో 18 నెలల బాలుడి మృతి

image

సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన 18 నెలల విహాంత్ అనే బాలుడికి పాము కాటు వేయడంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఆరుబయట అక్కతో ఆడుకుంటున్న విహాంత్ ఇంటి పక్కన ఉన్న పొద నుంచి వచ్చిన పాము బాలుణ్ని కాటు వేసింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

error: Content is protected !!