News November 7, 2024
భీమిని: ‘కలెక్టర్ సారూ మాకు న్యాయం చేయండి’

10వ తరగతి వరకు తరగతులు పెంచాలని విద్యార్థులు మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ను కోరారు. భీమిని మండలంలోని చిన్నగుడిపేట్ ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి వరకే ఉందని, ఆపై చదువులకు వెళ్లే వసతి, రోడ్డులేక చదువు ఆపేయాల్సి వస్తోందని చిన్నారులు వాపోయారు. తమ అభ్యర్థనను, ప్రభుత్వం, కలెక్టర్ గమనించి గ్రామంలోని పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News October 20, 2025
దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఆదిలాబాద్ ఎంపీ

గిరిజనుల దండారి ఉత్సవాల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లోని కొమరం భీమ్ కాలనీలో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమమే దండారి ఉత్సవాలు అన్నారు. ఈ కార్యక్రమంలో తాటి పెళ్లి రాజు, కనపర్తి చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.
News October 20, 2025
పోలీసు అమరవీరుల వారోత్సవాల షెడ్యూల్ ఇదే

జిల్లాలో అమరులైన పోలీసుల జ్ఞాపకార్థం నిర్వహించే ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం) వారోత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 21న హెడ్ క్వార్టర్స్‌లో అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్, ఎస్పీ నివాళులర్పిస్తారు. 22న మెగా రక్తదానం, 23న ఓపెన్ హౌస్, సైకిల్ ర్యాలీ, 24న 2000 మంది విద్యార్థులతో 5కే రన్ ఉంటుంది.
News October 20, 2025
ADB: బీసీ విద్యార్థులకు శుభవార్త..!

బీసీ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు పొడిగించారు. విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. గత గడువు 15తో ముగియగా.. పొడిగించినట్లు పేర్కొన్నారు.