News March 1, 2025

భీమిని: కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

image

భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు రేగుచెట్టు రమేశ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా.. ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు, బంధువులు దాడికి యత్నించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి, పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News December 6, 2025

US అగ్నిప్రమాదం.. మృతులు హైదరాబాదీలే!

image

అమెరికాలో అగ్నిప్రమాద <<18481815>>ఘటనలో<<>> మరణించిన ఇద్దరు హైదరాబాదీలేనని తెలుస్తోంది. HYD జోడిమెట్ల సమీపంలోని శ్రీనివాసకాలనీలో నివాసముండే సహజారెడ్డి(24) ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితమే USకు వెళ్లింది. నిన్న ప్రమాదంలో మరణించిందని అధికారులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె తండ్రి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా తల్లి ప్రభుత్వ ఉద్యోగి. మరో విద్యార్థి కూకట్ పల్లికి చెందిన వ్యక్తి అని సమాచారం.

News December 6, 2025

NGKL: ప్రజాస్వామ్యం అంటే మోదీకి విలువలేదు: ఎంపీ

image

ప్రజాస్వామ్యం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విలువలేదని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ, మల్లికార్జున కార్గేను ఆహ్వానించకపోవడం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ విలువలను పక్కనపెట్టి ఏకపక్షంగా ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు.

News December 6, 2025

రాజన్న సిరిసిల్ల: 21న లోక్ అదాలత్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలందరూ ఈ నెల 21న జరిగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని, పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని ఇన్‌ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పుష్పలత సూచించారు. శనివారం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.