News March 29, 2024
భీమిలిలో గురుశిష్యుల మధ్య పోటీ

భీమిలిలో గురుశిష్యుల మధ్య పోటీతో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. 2009లో అవంతిని గంటా రాజకీయాల్లోకి పరిచయం చేశారు. 2009లో వీరిద్దరూ ప్రజారాజ్యం నుంచి పోటీచేయగా అనకాపల్లిలో గంటా, భీమిలిలో అవంతి గెలిచారు. మారిన రాజకీయ పరిణామాలతో ఇద్దరూ వేరు వేరు పార్టీలలో చేరి మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరూ భీమిలిలో ప్రత్యర్థులుగా దిగుతున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News November 19, 2025
విశాఖలో 21 చోట్ల వీధివిక్రయాలకు ఏర్పాట్లు: కమిషనర్

నగరంలో 21 స్మార్ట్ వెడ్డింగ్ జోన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఎండాడ, సెంట్రల్ పార్క్ వద్ద వీధి విక్రయదారులకు ఏర్పాటు చేస్తున్న వెండింగ్ స్థలాలను పరిశీలించారు. పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నామని, అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు కమిషనర్ వివరించారు. జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, మల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.
News November 19, 2025
మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు.