News March 17, 2025

భీమిలి ఎమ్మెల్యేను కలిసిన స్టార్ డైరెక్టర్

image

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును విశాఖ, ఎం.వి.పి.కాలనీలోని ఆయన స్వగృహంలో స్టార్ డైరక్టర్ అనిల్ రావిపూడి టీం ఆదివారం కలిశారు. ప్రస్తుత సినిమాలు గురించి, మెగాస్టార్ చిరంజీవితో తాను తెరకెక్కించనున్న కొత్త సినిమా గురించి కొంతసేపు మాట్లాడుకున్నారు. కొత్త చిత్రాన్ని తెరకెక్కించే ముందు, ఆ కథతో వచ్చి సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవడం తనకు సెంటిమెంట్ అని అన్నారు.

Similar News

News March 17, 2025

కైలాసగిరిపై దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి 

image

కైలాసగిరిపై ఏప్రిల్ నాటికి దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి తీసుకొస్తామని వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ ప్రణవ్ గోపాల్, ఎంసీ విశ్వనాథన్ తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. బీచ్ రోడ్డులో హెలికాప్టర్ మ్యూజియం, సిరిపురంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్‌లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. అనకాపల్లి వద్ద హెల్త్ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

News March 17, 2025

అరిలోవ: జైలులో ఖైదీలకు ఫోన్‌లు అందించిన దంపతులు అరెస్ట్

image

సెంట్రల్ జైలులో ఖైదీలకు ఫోన్‌లు అందించిన కేసులో భార్యాభర్తలను అరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ కారాగారంలో పని చేసిన ఫార్మాసిస్టు శ్రీనివాసరావుతో పాటు అతడి భార్య పుష్పలతను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. జైలులో ఉన్న నాగమల్లేశ్వరావు అనే ముద్దాయికి ఫోన్లు అందించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. దంపతులు శ్రీకాకుళం జిల్లా జలుమూరు పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News March 17, 2025

అనకాపల్లి: దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. నిలిచిన రైళ్లు

image

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. రాత్రి రైల్వే వంతెన కింద నుంచి వెళ్తున్న ఓ భారీ వాహనం గడ్డర్‌ను ఢీకొనడంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో కశింకోటలో గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు, యలమంచిలిలో మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

error: Content is protected !!