News September 19, 2024
భీమిలి: కూల్చివేతలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
భీమిలి బీచ్లో MP విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చివేయాలని జీవీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. రాజకీయ జోక్యంతో కూల్చివేతలను ఆపవద్దని సూచించింది. ఫొటోలను పరిశీలిస్తే బీచ్లోనే నిర్మాణాలు చేసినట్లు స్పష్టం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.
Similar News
News December 22, 2024
విశాఖ జిల్లాలో హైటెక్ హరిదాసు
విశాఖ జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. దీంతో హరిదాసులు, బసవన్నలు గ్రామాల్లో సందడి చేస్తున్నారు. అయితే కాలానుగుణంగా హరిదాసులు కూడా మారుతున్నారు. ఒకప్పుడు కాలినడకన తంబుర పట్టుకుని వీధివీధి తిరిగేవారు. అయితే మర్రిపాలెం గ్రామంలో టూవీలర్ల పై హరిదాసులు తిరుగుతూ సందడి చేస్తున్నారు. దీన్ని చూసిన పలువురు ఆనాటి కళకనిపించడం లేదని అంటున్నారు.
News December 22, 2024
మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ట్రస్ట్ ద్వారా అనంతగిరి మండలం కొర్రపత్తి ఎం.పి.పి. స్కూల్ను అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. బల్లగరువులో సభను ముగించుకుని వెళ్తున్న పవన్ కళ్యాణ్ దారిలో ఉన్న కొర్రపత్తి స్కూల్కు వెళ్లి చిన్నారులు, సిబ్బందితో మాట్లాడగా వారు సమస్యను వివరించారు. అలాగే అంగన్వాడీ సెంటర్, స్కూల్ ప్రహరీ గోడ, ఊరిలో సీసీ రోడ్లు పంచాయతీరాజ్ శాఖ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు.
News December 22, 2024
రైవాడ అందాలను ‘క్లిక్’మనిపించిన పవన్ కళ్యాణ్
రైవాడ జలాశయ అందాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఫోన్లో చిత్రీకరించారు. బల్లగరువు బహిరంగ సభకు వెళ్లే క్రమంలో రైవాడ జలాశయ అందాలను తిలకించేందుకు జీనబాడు – కోలపర్తి సమీపంలో పవన్ కళ్యాణ్ కారు దిగి ఆ ప్రాంతంలో అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంలో ఫోన్లో ఆ సుందరమైన కొండల మధ్యలో జలాశయ అందాలను బంధించారు.