News September 19, 2024

భీమిలి: కూల్చివేతలపై స్టేకు హైకోర్టు నిరాకరణ

image

భీమిలి బీచ్‌లో MP విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చివేయాలని జీవీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. రాజకీయ జోక్యంతో కూల్చివేతలను ఆపవద్దని సూచించింది. ఫొటోలను పరిశీలిస్తే బీచ్‌లోనే నిర్మాణాలు చేసినట్లు స్పష్టం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.

Similar News

News October 14, 2024

విశాఖ జిల్లాలో 31 మంది మహిళలకు మద్యం షాపుల లైసెన్స్

image

విశాఖ జిల్లాలో 31 మంది మహిళల పేరున మద్యం దుకాణాలకు లైసెన్స్ లభించింది. మొత్తం జిల్లాలో 155 మద్యం షాపులకు గాను అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందుకోసం సుమారు 4000 దరఖాస్తులు అందాయి. సోమవారం షాపుల కేటాయింపు లాటరీ ప్రక్రియ ద్వారా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 31 మంది మహిళల పేరున మద్యం లైసెన్సులు మంజూరయ్యాయి.

News October 14, 2024

విశాఖ: కాఫీ కొనుగోలు ధరలను ప్రకటించిన జీసీసీ

image

గిరిజన సహకార సంస్థ 2024-25 సీజన్ కు గిరిజన రైతుల నుంచి సేకరిస్తున్న కాఫీ గింజలకు కొనుగోలు ధరలను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం జీసీసీ వైస్ ఛైర్మన్ ఎండీ కల్పనా కుమారి అధ్యక్షతన అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అరెబికా పార్చ్ మెంట్‌కు కిలో రూ.285, అరెబికా చెర్రీ రకానికి రూ.150, రోబస్టా చెర్రీ రకానికి రూ.80 చొప్పున ధర నిర్ణయించినట్లు తెలిపారు.

News October 14, 2024

16న విశాఖలో జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

image

విశాఖ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో నారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒకటి నుంచి ఏడు వరకు గల స్థాయిూ సంఘ సమావేశాలు వేరువేరుగా ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతాయన్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశానికి హాజరు కావాలని కోరారు.