News May 3, 2024
భీమిలి కొట్లాట కేసులో పదిమంది అరెస్ట్

భీమిలి మండలం గొల్లల తాళ్లవలసలో ఈనెల 1వ తేదీన టీడీపీ- వైసీపీ వర్గాల మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించి పది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కొట్లాట సమాచారం మేరకు మధురవాడ జోన్ ఏసీపీ సునీల్, భీమిలి సీఐ డి.రమేష్ తదితరులు ఈనెల 1వ తేదీ రాత్రి నుంచి గ్రామంలో భద్రత ఏర్పాట్లు చేశారు. విచారణ అనంతరం ఇరు వర్గాలకు చెందిన పదిమందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News November 30, 2025
వీఎంఆర్డీఏ పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు

వీఎంఆర్డీఏకు చెందిన పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు ప్రవేశపెడుతున్నామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీఎంఆర్డీఏ కార్యాలయంలో శనివారం బోర్డు సమావేశం జరిగింది. పర్యాటకుల సౌకర్యం కోసం ఈ కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రహదారులు, 2040 మాస్టర్ ప్లాన్, కైలాసగిరిపై అభివృద్ధి ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించామన్నారు.
News November 29, 2025
విశాఖలో 209 మంది పోలీసులకు రివార్డులు

విశాఖ పరిధిలో ప్రతిభ కనబర్చిన 209 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులు రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు.
News November 29, 2025
వీఎంఆర్డీఏ పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు

వీఎంఆర్డీఏకు చెందిన పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు ప్రవేశపెడుతున్నామని చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీఎంఆర్డీఏ కార్యాలయంలో శనివారం బోర్డు సమావేశం జరిగింది. పర్యాటకుల సౌకర్యం కోసం ఈ కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రహదారులు, 2040 మాస్టర్ ప్లాన్, కైలాసగిరిపై అభివృద్ధి ప్రాజెక్టులు గురించి సమావేశంలో చర్చించామని తెలిపారు.


