News April 24, 2024
భీమిలి: టెన్త్ విద్యార్థినికి 588 మార్కులు

భీమిలి ఏపీఆర్ఎస్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం కోడి రాంబాబు తెలిపారు. వారిలో నైమిష 588, ఎల్.దుర్గ 586, వి.జ్యోతి 583, ఎం.త్రిష 580 మార్కులు సాధించారన్నారు. కేజీబీవీ విద్యార్థినులు శతశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ గంగాకుమారి తెలిపారు. వారిలో ఏడుగురికి 500 మార్కులు దాటాయన్నారు. పండిట్ నెహ్రూ స్కూల్లో 72 మంది విద్యార్థులకు 55 మంది పాసయ్యారని హెచ్ఎం శ్రీదేవి తెలిపారు.
Similar News
News December 17, 2025
బతికున్నప్పుడే అన్నీ జరగాలి: అశోక్ గజపతి రాజు

ఎడ్యుసిటీ ఒప్పంద కార్యక్రమంలో అశోక్ గజపతి రాజు భావోద్వేగమయ్యారు. ‘మనం ఎప్పుడు చనిపోతామో చెప్పలేము.. బతికున్నప్పుడే సాధించాలి. నేను ఉన్నప్పుడే ఈ మంచి కార్యాలు జరగాలి. ప్రజలకు ఇంకా సేవ చేయాలి. నా తరువాత నా వారసులు ఆ పని కచ్చితంగా చేస్తారనే నమ్మకం నాకు ఉంది. మరిన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. అందుకు మీ ఆశీస్సులు ఉండాలంటూ’ ఆయన మాట్లాడారు.
News December 17, 2025
విశాఖలో 19న పెన్షన్, జీపీఎఫ్ అదాలత్

సిరిపురంలోని ఉడా చిల్డ్రన్ ఎరీనాలో డిసెంబర్ 19న ఉదయం 10 గంటలకు ‘పెన్షన్/జీపీఎఫ్ అదాలత్’ నిర్వహించనున్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఏజీ శాంతి ప్రియ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ పెన్షన్, జీపీఎఫ్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు. సంబంధిత అధికారులు, డీడీవోలు తప్పక హాజరుకావాలని జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు కోరారు.