News March 25, 2025
భీమిలి బీచ్‌లో నిర్మాణాల తొలగింపు

భీమిలి బీచ్‌లోని కోస్తా నియంత్రణ మండలి పరిధిలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీ నిర్మించిన ప్రహరీ, వాటి పునాదుల తొలగింపునకు జీవీఎంసీ సుమారు రూ.కోటి వెచ్చిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని తొలగించి ఈ నెల 26 కల్లా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో జీవీఎంసీ అధికారులు విరామం లేకుండా యంత్రాలతో పనిచేయిస్తున్నారు.
Similar News
News April 19, 2025
వ్యక్తిగత ప్రయోజనాలకే వైసీపీ పరిమితం: విశాఖ ఎంపీ

వ్యక్తిగత ప్రయోజనాలకే వైసీపీ ప్రభుత్వం పరిమితమైందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. శనివారం జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మాన ఓటింగ్‌లో కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీవీఎంసీలో అభివృద్ధి పరంగా ఎలాంటి పురోగతి జరగలేదన్నారు. రానున్న రోజుల్లో కూటమి నాయకత్వంలో జీవీఎంసీని పూర్తిగా ప్రజల అభివృద్ధికి కేటాయించబోతున్నామన్నారు.
News April 19, 2025
విశాఖ కొత్త మేయర్ ఆయనేనా?

జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో కూటమి నెగ్గడంతో కొత్త మేయర్ ఎవరన్న సందిగ్ధంలో కార్పొరేటర్లు ఉన్నారు. కూటమిలో పలువురు ఆశావాహులు మేయర్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న పీలా శ్రీనివాస్‌కే పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే డిప్యూటీ మేయర్ పదవికి అవిశ్వాసం జరిగితే ఆ పదవి జనసేనకు కేటాయిస్తారని కూటమి వర్గాల్లో చర్చనడుస్తోంది.
News April 19, 2025
విశాఖ మేయర్ పీఠం.. పార్టీల బలాబలాలు

మరికొద్ది గంటల్లో విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడనుంది. 2021లో జరిగిన GVMC ఎన్నికల్లో YCP 58 స్థానాలు నెగ్గి మేయర్ పీఠం కైవశం చేసుకుంది. TDP-30, JSP-3, CPM, CPI ఒక్కో స్థానం గెలిచాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమీకరణాలు మారాయి. దీంతో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కూటమికి సుమారు 64 మంది, YCPకి 30 మంది కార్పొరేటర్‌లున్నారు. ఈ ఓటింగ్‌కు కమ్యూనిస్ట్ పార్టీలు దూరంగా ఉంటున్నాయి.