News April 10, 2025
భీమిలి మార్కెటింగ్ మాజీ ఛైర్మన్ ఆత్మహత్య

విశాఖలో టీడీపీ నాయకుడు కోరాడ నాగభూషణం గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిలి మార్కెటింగ్ మాజీ ఛైర్మన్ కోరాడ నాగభూషణం ఆరిలోవ హెల్త్ సిటీలోని ఓ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం చేరారు. ఈ రోజు ఉదయం ఆస్పత్రి 4వ అంతస్తు నుంచి దూకి చనిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 5, 2026
తిమ్మాపురం బీచ్లో వృద్ధురాలి మృతి

తిమ్మాపురం బీచ్ సమీపంలోని కమ్యూనిటీ హాల్ వద్ద గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. 70 సంవత్సరాలు వయసున్న వృద్ధురాలు బీచ్ సమీపంలో రెండు రోజులుగా తిరుగుతూ ఉండగా స్థానికులు ఆహారం, దుప్పట్లు ఆమెకు ఇచ్చారు. ఆదివారం ఆమె మృతి చెందినట్లు గమనించి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 5, 2026
నేడే విశాఖ కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

విశాఖపట్నం కలెక్టరేట్లో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయవచ్చని, పాత అర్జీదారులు రసీదులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం ‘1100’ కాల్ సెంటర్ లేదా అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 4, 2026
భవిష్యత్తు అంతా పోరాట కాలం: సీఐటీయూ నేతలు

భవిష్యత్తంతా పోరాట కాలమని, ఐక్య ఉద్యమాలకు కార్మికవర్గం సిద్ధం కావాలని, ప్రధాని మోదీ జమానాలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని విశాఖలో సీఐటీయూ బహిరంగసభలో కార్మిక నేతలు అన్నారు. రాబోయే కాలమంతా పోరాటాలేనని, అందుకు కార్మికవర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న సమ్మెతో చరిత్ర సృష్టించాలన్నారు.


