News April 10, 2025
భీమిలి మార్కెటింగ్ మాజీ ఛైర్మన్ ఆత్మహత్య

విశాఖలో టీడీపీ నాయకుడు కోరాడ నాగభూషణం గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిలి మార్కెటింగ్ మాజీ ఛైర్మన్ కోరాడ నాగభూషణం ఆరిలోవ హెల్త్ సిటీలోని ఓ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం చేరారు. ఈ రోజు ఉదయం ఆస్పత్రి 4వ అంతస్తు నుంచి దూకి చనిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 6, 2025
ప్రచార రథం ప్రారంభమయ్యేది అప్పుడే

జులై 9న మ.2 గంటలకు సింహాచలం గిరిప్రదక్షిణ ప్రచారరథం ప్రారంభమవుతుందని ఈవో త్రినాథరావు కలెక్టర్‌కు వివరించారు. తొలిపావంచా వద్ద అశోక్ గజపతి చేతుల మీదుగా ప్రచారరథం ప్రారంభమవుతుందన్నారు. ఆరోజు రాత్రి 11 గంటలకు రథం ఆలయానికి చేరుకుంటుందని, మరుసటి రోజు ఉ.5 నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.10వ తేదీ సాయంత్రం 7వరకు దర్శనాలు ఉంటాయన్నారు.
News July 6, 2025
ఈనెల 10న మెగా పేరెంట్ మీట్: కలెక్టర్

జిల్లాలని అన్ని పాఠశాలల్లో ఈనెల 10న మెగా పేరెంట్ మీట్ నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉన్న 1385 పాఠశాలల్లో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో హాజరవ్వాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పథకంలో అతిథిలకు స్కూల్లోనే భోజనం అందించాలన్నారు 212 జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలన్నారు.
News July 5, 2025
విశాఖలో టాస్క్‌ఫోర్స్‌కు అదనపు సిబ్బంది

విశాఖలో టాస్క్ ఫోర్స్ బలోపేతం చేసేలా పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సీఐల పర్యవేక్షణలో టాస్క్ ముమ్మరంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తూ మరో ఏడుగురి సిబ్బందిని నియమించారు. భీమిలి ఎస్ఐ హరీశ్‌తో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, మరో ఐదుగురు కానిస్టేబుళ్లను టాస్క్‌ఫోర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.