News November 24, 2024
భీమిలి: యువతి సూసైడ్.. వేధింపులే కారణం!
భీమిలి మం. మజ్జివలసకు చెందిన రాశి(22) అదే ప్రాంతానికి చెందిన రాజు (26) వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాశి విద్యా వాలంటీర్‌గా పనిచేస్తోంది. ప్రేమ పేరుతో రాజు ఆమెను వేధింపులకు గురిచేయగా ఈ నెల 16న ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఫోన్‌డేటా ఆధారంగా రాజును ఈనెల 22న అరెస్ట్ చేశారు.
Similar News
News November 24, 2024
విశాఖలో ప్రధాని పర్యటనపై కలెక్టర్ సమీక్ష
ఈనెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు పలు విభాగాల ఉన్నతాధికారులతో కలెక్టరేట్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. ఐఎన్ఎస్ డేగాలో బస చేస్తారని వెల్లడించారు. అనంతరం ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు.
News November 24, 2024
సింహాద్రి అప్పన్నకు వైభవంగా స్వర్ణ పుష్పార్చన
సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్నకు ఆదివారం ఉదయం వైభవంగా స్వర్ణపుష్పార్చన నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి సంప్రదాయ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా గోవిందరాజుల స్వామిని ఆలయ కళ్యాణ మండపంలో అదిష్ఠింపజేసి వేదమంత్రాలు, నాదస్వర వాయిద్యాల మధ్య 108 బంగారు సంపెంగలతో స్వర్ణపుష్పార్చన నిర్వహించారు.
News November 24, 2024
విశాఖ రైల్వే జోన్‌లో బిల్డింగ్స్ నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
విశాఖలో ఏర్పాటు కానున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు సంబంధించి GM ఆఫీస్, కాంప్లెక్స్ (B2+B1+G+9) భవనాల నిర్మాణానికి రైల్వే శాఖ ఈ- టెండర్లను ఆహ్వానించింది. దీనికి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆమోదం తెలిపారు. డిసెంబర్ 13 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ టెండర్ దాఖలు చేసుకోవచ్చని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ ఈ భవనాలను రెండు సంవత్సరాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది.