News September 18, 2024
భీమిలి: స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి

భీమిలి మండలం నారాయణరాజుపేట గ్రామంలో విషాదం నెలకొంది. రౌడి గ్రామంలోని నర్సరీ చదువుతున్న బి.వేణు తేజ(5) బస్సు దిగి వెనుక వైపు నిల్చున్నాడు. గమనించని డ్రైవర్ రివర్స్ చేయగా.. ఆ బాలుడు బస్సు వెనుక చక్రాల కింద పడి చనిపోయాడు. బస్సు ఆ చిన్నారి తలపై నుంచి వెళ్లిపోయింది. బస్సుకు క్లీనర్ లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Similar News
News December 16, 2025
విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్

విశాఖలో మంత్రి లోకేశ్ మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. కంచరపాలెంలో ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందిన తనకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందజేసేలా చర్యలు తీసుకోవాలని సతీశ్వరరెడ్డి కోరారు. కోనసీమ, పోలవరంలో గుత్తైనదీవిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలనీ కోరారు.
News December 16, 2025
విశాఖలో ఐదుగురు ఎస్ఐలను రేంజ్‌కు అప్పగింత

విశాఖ నగరంలో ఐదుగురు ఎస్ఐలపై పోలీస్ కమిషనర్ శంఖ బత్రబాగ్చి చర్యలు తీసుకున్నారు. తక్షణమే ఈ అధికారులను రేంజ్‌కు అప్పగిస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు. త్రీటౌన్ క్రైమ్ ఎస్ఐ సల్మాన్ బేగ్, టూటౌన్ క్రైమ్ ఎస్ఐ సునీల్, పీఎం పాలెం ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్, ఫోర్త్ టౌన్ క్రైమ్ ఎస్ఐ విజయ్‌కుమార్, భీమిలి ఎస్సై భరత్ కుమార్ రాజులు రేంజ్‌కు అప్పగించారు. ఈ చర్య పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.
News December 16, 2025
పోర్టు కళావాణి స్టేడియం స్వాధీనం చేసుకున్న యాజమాన్యం

అక్కయ్యపాలెం జాతీయ రహదారి కానుకొని ఉన్న పోర్టు కళా వాణి ఆడిటోరియం లీజు ఒప్పందాలను రద్దు చేసినట్లు విశాఖ పోర్ట్ అథారిటీ యాజమాన్యం ప్రకటించింది. క్రీడా సముదాయం గతంలో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించామని లీజ్ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు పాటించకపోవడంతో రద్దుచేసి నోటీసులు జారీ చేశామని పోర్టు యాజమాన్యం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో స్టేడియం స్వాధీనం చేసుకున్నారు.


