News February 14, 2025

భీమిలి: స్వీట్ షాప్‌లో కుప్పకూలి మృతి

image

తగరపువలసలోని ఓ స్వీట్‌షాప్‌లో మహిళ మృతిచెందింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లికి చెందిన రక్షణకుమారి కొంతకాలంగా ఓ స్వీట్ షాప్‌లో పనిచేస్తోంది. గురువారం సాయంత్రం ఒంట్లో బాగోలేదని ట్యాబ్లెట్ వేసుకుని షాప్‌కి వెళ్లింది. అక్కడ పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. భీమిలి పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 9, 2026

జిల్లా రివ్యూలో ఎమ్మెల్యే పల్లా సూచనలు

image

జిల్లా రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రభుత్వం సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే విధంగా పాలన ఉండాలని స్పష్టం చేశారు. మెడికల్ అండ్ హెల్త్ విభాగం పరిధిలో నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు, మాతృ మరణాల రేటు, శిశు మరణాల రేటు పరిశీలించాలన్నారు.

News January 9, 2026

విశాఖ: గాలి నాణ్యత పెరిగేందుకు చర్యలు

image

విశాఖలో గాలి నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో నిర్వహించిన DRC సమావేశంలో ఆయన మాట్లాడారు. సమిష్టి కృషితో ఇది సాధ్యమన్నారు. టార్పలిన్లు లేకుండా బొగ్గు, ఇసుక, ఇతర సామగ్రిని రవాణా చేయొద్దని సూచించారు. వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News January 9, 2026

విశాఖ కలెక్టరేట్లో నగర అభివృద్ధిపై సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం ఉదయం నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 3 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించనున్నారు. భూ కేటాయింపులు, శంకుస్థాపనలు, అభివృద్ధిపై సమీక్ష జరగనుంది.