News February 14, 2025
భీమిలి: స్వీట్ షాప్‌లో కుప్పకూలి మృతి

తగరపువలసలోని ఓ స్వీట్‌షాప్‌లో మహిళ మృతిచెందింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లికి చెందిన రక్షణకుమారి కొంతకాలంగా ఓ స్వీట్ షాప్‌లో పనిచేస్తోంది. గురువారం సాయంత్రం ఒంట్లో బాగోలేదని ట్యాబ్లెట్ వేసుకుని షాప్‌కి వెళ్లింది. అక్కడ పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. భీమిలి పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News July 11, 2025
కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’

కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’ని ప్రవేశపెట్టాలని V.M.R.D.A. నిర్ణయించింది. సింగపూర్‌లోని సెంటోసా వద్ద ఈ రైడ్ అత్యంత ప్రజాదరణ పొందింది. గురుత్వాకర్షణ ఆధారంగా ఈ వినోదాత్మక రైడ్ ఉంటుంది. అన్ని వయస్సుల వారు ఈ రైడ్‌ను ఆస్వాదించవచ్చని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. కైలాసగిరిపై ఇది మంచి టూరిస్టు ఆకర్షణ అవుతుందని భావిస్తున్నామని ఎంసీ విశ్వనాథన్ తెలిపారు.
News July 11, 2025
కైలాసగిరిపై ‘ఎకో హైట్స్’ కాటేజీలు

కైలాసగిరిపై ‘ఎకో హైట్స్’ కాటేజీలు నిర్మించనున్నామని V.M.R.D.A. ఎంసీ విశ్వనాథన్ తెలిపారు. 360 డిగ్రీ రివాల్వింగ్ ఫైన్ డైన్ రెస్టారెంట్, బే వ్యూ కేఫే కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి కోసం RFP విడుదల చేయునున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులను V.M.R.D.A., ప్రైవేట్ పెట్టుబడిదారులకు పరస్పర లాభదాయకంగా (విన్-విన్) ఉండేలా నిర్మించనున్నారు.
News July 11, 2025
వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అన్ని చోట్లా ఫాగింగ్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశామయ్యారు. అన్ని వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుద్ధ్య చర్యలు పక్కాగా చేపట్టాలని సూచించారు. దోమల నివారణలో భాగంగా వీధులలో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని చెప్పారు.