News June 25, 2024
భీమిలి: 4 రోజుల వ్యవధిలో తండ్రీకొడుకు మృతి

భీమిలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రేబిస్‌తో కుమారుడు మృతి చెందిన నాలుగు రోజులకే తండ్రి బెంగతో మంగళవారం మృతి చెందాడు. ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్న అల్లిపల్లి నర్సింగరావుకు పిల్లలు లేకపోవడంతో అబ్బాయిని పెంచుకున్నాడు. అతడిని ఇంట్లో ఉన్న కుక్క కరిచింది. దానిని నిర్లక్ష్యం చేయడంతో ఆ అబ్బాయి రేబిస్ సోకి మృతి చెందాడు. దీంతో బెంగ పడిన నర్సింగరావు ప్రాణాలు విడిచారు.
Similar News
News November 22, 2025
వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా

బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది కలుగకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున 12,130 మందికి రూ.25 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు.