News February 17, 2025
భీమునిపట్నం: రోడ్డుపై మట్టిని తొలగించిన కానిస్టేబుళ్లు

విధి నిర్వహణలో సామాజిక బాధ్యతతో వ్యవహరించిన పెట్రోలింగ్ పోలీసులు పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆదివారం రాత్రి భీమిలి బీచ్ రోడ్డులో తిమ్మాపురం నుంచి రామానాయుడు స్టూడియో మధ్యలో లారీ నుంచి మట్టి జారి రోడ్డు మధ్యలో పడింది. దీనిని గమనించిన బీచ్ పెట్రోల్ కానిస్టేబుళ్లు సతీశ్, గణేశ్ వెంటనే స్పందించి మట్టిని తొలగించారు. అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులకు జాగ్రత్తగా వెళ్లమని సూచించారు.
Similar News
News March 22, 2025
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

సామర్లకోట, పిఠాపురం మధ్య రైల్వే నాన్ ఇంటర్ లాకింగ్ పనుల వలన విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు సీనియర్ డీసీఎం సందీప్ శనివారం తెలిపారు. విశాఖ -కాకినాడ పాసెంజర్ (17267/68), విశాఖ – రాజమండ్రి పాసెంజర్ (67285/86), విశాఖ -గుంటూరు ఉదయ్ ఎక్స్ ప్రెస్ (22875/76) రైళ్ళు మార్చి 24న రద్దు చేశామన్నారు. విశాఖ – గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239/40) రైళ్ళు మార్చి 24, 25న రద్దు చేశామన్నారు.
News March 22, 2025
విశాఖ: పేదరిక నిర్మూలనకు పి-4 దోహదం: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి-4 విధానం పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందని, అధికారులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని పలు సంఘాల ప్రతినిధులు, అధికారులతో శనివారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. పి-4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని, అందరూ దీని ఆవశ్యకతను తెలుసుకొని భాగస్వామ్యం కావాలన్నారు.
News March 22, 2025
విశాఖ: పాత హత్యా కేసును ఛేదించిన నగర పోలీసులు

విశాఖ జిల్లాలో 2021లో కొందరు దొంగలు జి శ్రీను అనే వ్యక్తి మర్మాంగం కోసి రోడ్డుపై హత్య చేశారు. ఈ హత్యపై ఎలాంటి ఆధారాలు లేక అప్పుడు కేసు క్లోజ్ చేశారు. ప్రస్తుతం విశాఖ పోలీసులు క్లోజైన కేసులను ఓపెన్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యను అనకాపల్లికి చెందిన లాలం గణేష్, పెద్ద గంట్యాడకు చెందిన తారకేశ్వరరావు చేసినట్లు గుర్తించారు. దీంతో శనివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.